గ్రహ బలమేమి శ్రీ రామానుగ్రహ బలమే బలము

గ్రహ బలమేమి శ్రీ రామానుగ్రహ బలమే బలము

గ్రహ బలమేమి తేజో-మయ

విగ్రహమును ధ్యానించు వారికి నవగ్రహ బలమేమి

గ్రహ పీడల పంచ పాపముల-

నాగ్రహములు గల కామాది రిపుల నిగ్రహము జేయు హరిని భజించు త్యాగరాజునికి రసికాగ్రేసరులకు…గ్రహ బలమేమి

ఓ మానవా! రసికులకు ( సంగీత పిపాసులకు , రసజ్ఞులకు  – భగవంతుని  భజన చేయువారు) రాముని భజించు త్యాగరాజుకి,హరిని నమ్మిన వారికి , ఎటువంటి హరి అంటే మనలోని అరిషడ్వర్గములను (కామ, క్రోధ,మద, మత్సరాదులు)దహించునటువంటి హరి, పంచ మహా పాతకములు( దొంగతనం, గురు నింద( గురు పత్నితో సంగమం) , సురాపానము,పరుషముగా ( అసత్యము) మాట్లడుట, బ్రాహ్మణ హత్య,దానివల్ల వచ్చే పాపములను , గ్రహము ల  వల్ల వచ్చే కష్టాలను నిగ్రహించుటలో తీసివేయుటలో మహా నేర్పరి అయిన హరిని భజించు వారికి గ్రహ బలము ఎందులకు, అవసరం లేదు. 
రాముడు తేజోమయ శరీరము కలవాడు,  చైతన్య స్వరూపుడు అయిన వానిని ధ్యానించు వారికి , శ్రవణాది నవవిధ భక్తి మార్గములో నిధి ,ధ్యాస, ధారణాదులలో సదా ఆ జ్యోతి స్వరూపమునందు రమించువారికి , ఆ పరతత్వ రూపుడైన శ్రీరాముని అనుగ్రహ బలము కలవారికి  గ్రహ బలము తో ఏమి పని. అవసరం లేదు. 

నమ్మిన గురు , దైవ బలము తోడుంటే గ్రహబలము లేకపోయిన పరవాలేదు. సాధకుడు ఉద్దరింప బడుతాడు.

Leave a comment