మోక్షము గలదా భువిలో

మోక్షము గలదా భువిలో

జీవన్ముక్తులు కాని వారలకు


సాక్షాత్కార నీ సద్భక్తి

సంగీత జ్ఞాన విహీనులకు… మోక్షము గలదా


ప్రాణానల సంయోగము వల్ల

ప్రణవ నాదము సప్త-స్వరములై పరగ

వీణా వాదన లోలుడౌ శివ మనో-

విధమెరుగరు త్యాగరాజ వినుత… మోక్షము గలదా

ఓ.త్యాగరాజ వినుత ! శ్రీ రామ , ఈ భూమిపైన జీవులకు మోక్షము వుందా ? జీవులు జీవన్ముక్తి పొందకుండా మోక్షము లభిస్తుందా. ( మోక్షము – జీవన్ముక్తి ఓకే అర్థము చెప్పినప్పటికి సాధనలో తేడాలు వున్నాయి. ముక్తి- విదేహముక్తి, జీవన్ముక్తి , కైవల్యము. దీనినే సామీప్య, సాలోక్య,సారూప్య, సాయుజ్య(చివరిది  జీవన్ముక్తి). అని రెండు రకాలు. ముక్తిక ఉపనిషత్. ఇది కాకుండా సద్యో ముక్తి, క్రమ ముక్తి- బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్ద,సన్యాస విధములలో ముక్తిచెందడము. ) తామరాకుపై నీటిబొట్టులావుండడం.
అంతేనా ఓ నిత్యమైన వాడా జీవులకు నీ యందు  సద్భక్తి-విశ్వాసం, సంగీత జ్ఞానము లేనివారలకు ముక్తి ఎక్కడిది. అనగా పరమాత్మపై నిశ్చల భక్తితో అంతర్నేత్రుడై లోన వినిపించే సంగీతమును ఆ జ్ఞానము లేని(నాదయోగం) వారలకు ముక్తి ఎక్కడిది?
లోన వినపడే నాదం ఓంకారమై  గాలి మరియు అగ్ని – అనాహత చక్రం మరియు మణిపూర చక్రం లోజరిగే సంయోగం వల్ల నాదం శబ్దమై  సూక్ష్మ రూపముగా అదే సప్తస్వరములై బయటకు వెలువడుతుంది ( పరా, పశ్యంతి, మద్యమా,వైఖరి) జీవుడి వెన్నుపూసే రుద్రవీణగా మలుచుకొని ఆ నాదంయందు నిమగ్నుడౌ ఆ  శివుడి అంతర్దృష్టి ని లోన వున్న పరమాత్మని ఎరగనివారికి మోక్షము కలదా?

Advertisements

లం ఇత్యాది పంచ పూజ

ఇది లమిత్యాది పంచోపచార పూజా విధానం. బొమ్మలో చూపిన విధంగా ముద్రలు చూపి నమః కు ముందు ఇష్ట దైవాన్ని చేర్చుకోవాలి.

ఉదాహరణకు ‘లం పృథ్వీ తత్వాత్మనే శ్రీ లక్ష్మీ వెంకటేశాయ నమః ‘

*******************************

​లం పృథ్వీ తత్వాత్మనే శ్రీ ___ నమః| గంధం పరికల్పయామి||

హం ఆకాశ తత్వాత్మనే శ్రీ ___ నమః| పుష్పాణి పరికల్పయామి||

యం వాయు తత్వాత్మనే శ్రీ ___ నమః| ధూపం పరికల్పయామి||

రం అగ్ని తత్వాత్మనే శ్రీ ___ నమః| దీపం పరికల్పయామి||

వం అమృత తత్వాత్మనే శ్రీ ___ నమః| నైవేద్యం పరికల్పయామి||

సం సర్వ తత్వాత్మనే శ్రీ ___ నమః| సర్వోపచార పూజాం సమర్పయామి||

​ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన, అంతమాత్రమే నీవు 

​ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన, అంతమాత్రమే నీవు 

అంతరాంతరములెంచి చూడ, పిండంతేనిప్పటి అన్నట్లు 


కొలుతురు మిము వైష్ణవులు, కూరిమితో విష్ణుడని 

పలుకుదురు మిము వేదాంతులు, పరబ్రహ్మంబనుచు 

తలతురు మిము శైవులు, తగిన భక్తులునూ శివుడనుచు 

అలరి పొగడుదురు కాపాలికులు, ఆది భైరవుడనుచు 


సరి మిమ్ముదురు సాక్తేయులు, శక్తి రూపు నీవనుచు 

దరిశనములు మిము నానా విధులను, తలుపుల కొలదుల భజింతురు 

సిరుల మిమునే అల్పబుద్ది, తలచినవారికి అల్పంబగుదవు 

దరిమల మిమునే ఘనమని తలచిన, ఘనబుద్ధులకు ఘనుడవు 


నీవలన కొరతే లేదు మరి నీరు కొలది తామరవు 

ఆవల భాగీరధి దరి బావుల ఆ జలమే ఊరినయట్లు 

శ్రీ వేంకటపతి నీవైతే మము చేకొని వున్న దైవ(ము)మని 

ఈవలనే నీ శరణనిఎదను, ఇదియే పరతత్వము నాకు

ఓ శ్రీ వేంకటేశ్వర,పరికించి చూడగా పిండి కొద్ది రొట్టి అన్నట్టు, నిన్ను ఎవ్వరు ఎంత తలిస్తే లేదా భావిస్తే వారికి అలా కనపడతావు .

వైష్ణవులు విష్ణువని,శైవులు శివుడని,వేదాంతులు పరబ్రంహ్మమని,కాపాలికులు భైరవుడని,శాక్తేయులు శక్తి అని ఇలా నానా విధములుగా వారికి దర్శనములు,నిదర్శనములు కోలది నిను భజిస్తున్నారు. 

అల్పబుద్ది వారికి అల్పంగాను,ఘన బుద్ది కలవారికి ఘనము గాను కనపడుతున్నావు.

ఎంత నీరు ఉంటే అంతగా తామరాలు పూస్తాయి కదా.

నిరంతరమూ గంగ దగ్గరి బావుల్లో ఆలనం ఊరినట్లు నీ వలన కొరత అనేది లేదు