శివే పాహి మాం అంబికే

శివే పాహి మాం అంబికే

శ్రిత ఫల దాయకి


కవేరజోత్తర తీర వాసిని

కాత్యాయని ధర్మ సంవర్ధని…శివే పాహి మాం


స్వభావమౌ నీ ప్రభావము

మహానుభావురాలైన భారతికి పొగడ

భారమైయుండ భావజారాతి

భామ నేనెంత భాగ్య దాయకి…శివే పాహి మాం


కలార్థమిది శశి కలా ధరి ఉపవలారి మాయా విలాసిని

సకలాగమ నుతే భళారియన శుభ

ఫలాలొసగు పరమ లాలనమ్మున…శివే పాహి మాం


చరాచర-మయీ కరారవిందమున

రామ చిలుకను బిరాన పూని

పరాకుగ జూడ రాదు శ్రీ రఘువరాప్తుడగు త్యాగరాజ వినుతే…శివే పాహి మాం

ఓ జగన్మాత! శ్రీ రఘవరునికి ఆప్తుడైన త్యాగరాజు చేత పొగడబడుతున్న అంబిక !పాహిమాం .. కాపాడు ,రక్షించు. నిన్ను ఆశ్రయించిన వారి కోరికలను ఈడేర్చే మంగళదాయిని సర్వ మంగళా రక్షించు. 
ఓ కాత్యాయన మహర్షి పుత్రికవైన కాత్యాయని! ధర్మ సంవర్ధిని( తిరువయ్యురు లోని అమ్మవారి పేరు) ధర్మాన్ని రక్షించేటువంటి,ధర్మాన్ని కాపాడేవారిని అభివృధ్ధి చేసేటువంటిదానవు,కావేరీ ఉత్తర తీరంలో వేలసిన,కావేరీ మహారాజుకు పుత్రికవైన ఓ అంబా రక్షించు. 
ఓ భావజారాతి  భామ – భావజుడు మన్మథుడు ,రాతి – శత్రువైన శివుడికి ఇల్లాలా నిన్ను నమ్మిన వారికి సకల భాగ్యములను ప్రసాదించే  తల్లి, నీకి సహజసిద్ధములైన  నీ ప్రభావములను పోగడడానికి ఆ బ్రహ్మ ఇల్లాలైన సరస్వతి దేవికే కష్టముగా వుండ, పామురుడైన నేనెంత ఓ అంబా రక్షించు. 
ఓ చంద్ర కళాధరి, మాయా(వైష్ణవీ శక్తి) ఉపవలారి( వలడు వృత్థాసురుని తమ్ముడు, ఇంద్రుని శత్రువు, ఉపేంద్రుడు ) అంటే నారాయణుడు వైష్ణవీ విలాసినీ, సకల ఆగముములచే పొగడబడే అంబా,  అతి సొగసుతో, లాలనతో , కన్నతల్లి బిడ్డలను చూచినట్టు మాకు శుభ ఫలములను ఇచ్చేటువంటి నీ మహిమలను భళా అని కనీసం ఓక్క క్షణకాలము ( కలార్థము)  అంటే నీ మహిమలను  నేను చెప్పుకొంటే ఆ జన్మ ధన్యం… అంబా రక్షించు. 
సకల జగత్తునందు , ఉన్న, నిండిన ఓ అంబా నీ అందమైన పద్మముల వంటి చేతులయందు రామచిలుకను ( వాక్కుకు ప్రతీక) ధరించి , నన్ను కడకన్నులతో (శీతకన్ను)(చిన్నచూపు)చూడవద్ధు. ఓ అంబా పాహిమాం.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s