ఏహి త్రి-జగదీశ శంభో మాం పాహి

ఏహి త్రి-జగదీశ శంభో మాం పాహి పంచ నదీశ


వాహినీశ రిపు నుత శివ సాంబ దేహి త్వదీయ కరాబ్జావలంబం…ఏహి త్రి-జగదీశ


గంగా ధర ధీర నిర్జర రిపు పుంగవ సంహార

మంగళ-కర పుర భంగ విధృత సుకురంగాప్త హృదయాబ్జ భృంగ శుభాంగ…ఏహి త్రి-జగదీశ


వారణాజిన చేల భవ నీరధి తారణ సురపాల

క్రూర లోకాభ్ర సమీరణ శుభ్రశరీర మామకాఘ హర పరాత్పర…ఏహి త్రి-జగదీశ


రాజ శేఖర కరుణా సాగర నగ రా(జా)త్మజా రమణ

రాజ రాజ పరిపూజిత పద త్యాగరాజ రాజ వృష రాజాధిరాజ …ఏహి త్రి-జగదీశ

ఓ జగదీశ ! త్రిలోకములకు అధిపతివి , రాజులలో శ్రేష్టమైనవాడ, కరుణా సముద్రుడా, పర్వతపుత్రిక అయిన పార్వతీ రమణుడా , చక్రవర్తులు, రాజాధిరాజులచే పూజింపబడే పదములు కలవాడ , మహా వృషభమైన మహానందిని వాహనంగా కలవాడ, త్యాగరాజు ని పరిపాలించే శ్రీ తిరువయ్యురు పరిపాలిత ఐదు నదులకు  రాజైన శ్రీ త్యాగరాజ స్వామి ( శివుడు)   శంభో ఏహి – ఇటు రావయ్యా , నన్ను పాలించు కాపాడు. 
  మహా తపశ్శాలి అయిన అగస్త్య మహర్షి చేత పొగడబడి పూజలందే ఓ శంభో , నీవు నీ దేవేరి అయిన అంబతో(సాంబ) కలసి పద్మములవంటి మీ చేతులను నాకు అసారాగా ( అవలంబం) ఇవ్వండి ఈ సంసారమును దాటుటకు. 
గంగాదేవిని ధరించి, మంగళములను ప్రసాదించే, అందమైన శరీరము కలవాడ ( శుభాంగ) , దేవతలకు శత్రువులైన రాక్షస నాయకులను  సంహరించే ధీరుడా,  ఓ త్రిపురాసుర సంహార, నీ చేతిలో మనస్సు అనే జింకను( సుకురంగ) ధరించిన వాడ, 

నీను సదా ధ్యానించే  సాధకుల( ఆప్త)  హృదయము అనే పద్మములచుట్టు తిరుగుతూవుండే భ్రమరము వంటి వాడైన ఓ శంభో పాహి. 
ఓ దేవతలను పాలించే వాడ, గజచర్మమును ధరించినవాడ, సంసారసాగరమును దాటించేవాడ, నీవు నా పాపాలను తోలగిస్తున్నావు, అది ఎలా వుందంటే ఏ విదంగా గాలి మేఘాలను కదిలిస్తుందో ఆ విధంగా మంచి మెరిసే శరీరము ( నీ దివ్యతేజము) యోక్క తేజస్సు  నా చుట్టు ఆవరించిన ( అంతరంగంలోను , బాహ్యంలోను)  క్రూరమైన కొరికలు అనే లోకాన్ని , నా పాపాలను  ఆ విధంగా తోలగిస్తున్నావు.   ఓ పరాత్పరా మహా దేవ రక్షించు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s