ఏల నీ దయ రాదు

ఏల నీ దయ రాదు పరాకు

జేసేవేల సమయము కాదు


బాల కనక మయ చేల సుజన

పరిపాల శ్రీ రమా లోల విధృత శర

జాల శుభద కరుణాలవాల ఘన

నీల నవ్య వన మాలికాభరణ…ఏల నీ దయ రాదు


రారా దేవాది దేవ రారా మహానుభావ

రారా రాజీవ నేత్ర రఘు వర పుత్ర

సారతర సుధా పూర హృదయ

పరివార జలధి గంభీర దనుజ

సంహార మదన సుకుమార బుధ జన

విహార సకల శ్రుతి సార నాదుపై…ఏల నీ దయ రాదు


రాజాధి రాజ ముని పూజిత పాద రవి

రాజ లోచన శరణ్య అతి లావణ్య

రాజ ధర నుత విరాజ తురగ సుర

రాజ వందిత పదాజ జనక దిన

రాజ కోటి సమ తేజ దనుజ గజ

రాజ నిచయ మృగ రాజ జలజ ముఖ…ఏల నీ దయ రాదు


యాగ రక్షణ పరమ భాగవతార్చిత

యోగీంద్ర సుహృద్భావితాద్యంత రహిత

నాగ శయన వర నాగ వరద

పున్నాగ సుమ ధర సదాఘ మోచన

సదా గతిజ ధృత పదాగమాంత చర

రాగ రహిత శ్రీ త్యాగరాజ నుత…ఏల నీ దయ రాదు

ఓ త్యాగరాజు చేత పొగడబడే ఓ శ్రీరామ! నీవు రాగము లేనివాడివి,  వేదముల యొక్క సారము , ఆగముల చేత పొగడబడే, సదా హనుమంతుల (సదా గతిజ)వారిచే  పాదపూజలు పొందే వాడివి, మాయొక్క పాపములను పొగొట్టే వాడివి, పున్నాగ, తులసీ, పద్మముల పూమాలలను ధరించి, నిను వేడిన గజరాజును రక్షించిన వాడివి ,  ఆదిశేషుడే నీకు తల్పంగా కలిగినవాడివి , మునులు, యోగులు, మహర్షులు తమ తమ హృదయములలో సదా నీ ధ్యానంతో లీనమైవుంటు, నీవు ఆది , అంతము లేని వాడవని, పరమ భాగవతులైన ( నారద, శుక, పరొశర ఇత్యాది) వారిచే పూజలు అందు కొంటు  యాగరక్షణార్థమై లక్ష్మణునితో పాటు  విశ్వామిత్రుని వెంట వెళ్ళినవాడివి , అంతటి కరుణ కలిగిన నీకు నా పై ఎందుకు దయ కలగడంలేదు, పరాకు చేసేందుకు ఇది సమయం కాదు, రక్షించు. 
ఓ త్రిలోక చక్రవర్తి, మునలచే పూజింపబడే పాదములు కలవాడవు, సూర్య చంద్రులు కన్నులుగా కలిగిన వాడవు, అత్యంత మనోహరమై లావణ్యమైన శరీరముకలిగి నిను ఆశ్రయించిన వారిని పాలించే వాడవు, చంద్రుని ధరించిన శివుడిచే సదా స్మరింపబడెవాడవు, గరుత్మంతుడు (విరాజ)  వాహనంగా కలగి దేవతలచే పూజింపబడే పాదపద్మములు కలవాడవు,  కోటి సూర్యుల తేజస్సు నీ తేజస్సు ముందు వెలవెల పోయే తేజస్సు కలవాడవు,  రాక్షసులు అనే ఏనుగులను సంహరించే సింహము వంటి వాడవు,  పద్మము వంటి ముఖము కలవాడవైన నీకు నాపై దయలేదు ఎందుకు. 
ఓ దేవాది దేవ, మహానుభావ, దేవతలలో(త్రిమూర్తులలో)  ఉత్తముడవని భృగు  మహర్షి చే కొనియాడబడినవాడ (సారతర)  పద్మముయొక్క రేకులవంటి కన్నులు కలవాడ,  రఘ వంశమునకు వరముగా దక్కిన వాడా, నీ పరివారము అంతా కూడ నీవలే అమృత హృదయములు కలిగిన వారు, సముద్రము ను గడగడలాడించిన నీ గాంభీర్యము , రాక్షసులను సంహరించే నీ శక్తి, మన్మథులను మించిన సౌకుమార్యము అందము కలిగిన వాడ, కవి జనులు,  మంచివారి హృదరములలో సదా విహరించే వాడ, అన్ని వేదములకు వేదాంతములకు మూలమైన వాడ రావయ్యా , ఏందుకు నాపై కరుణ రాదు. 
ఓ బాలుడా (రామ) నీలవర్ణముచే ఒప్పు  శరీరము కలిగి, వైజయింతీ మాల, రకరకమలైన ఆభరణములను ధరించి , బంగారు వస్త్రములను(పీతాంబరము) ధరించి, ఆర్తులను , మంచివారిని పాలించే వాడ, లక్ష్మీదేవిచే పూజలందే వాడ, శుభములు ఒసగేవాడా, కరుణా సముద్రుడా ఎందుకు నీకు దయరాదు. కరుణ చూపించు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s