శివ శివ శివయన రాదా

శివ శివ శివయన రాదా ఓరి

భవ భయ బాధలనణచుకో రాదా…

శివ శివ 

కామాదుల తెగ కోసి పర భామల పరుల ధనముల రోసి పామరత్వమునెడబాసి అతి

నేమముతో బిల్వార్చన జేసి …శివ శివ 


సజ్జన గణముల కాంచి ఓరి ముజ్జగదీశ్వరులని మతినెంచి లజ్జాదుల తొలగించి తన హృజ్జలజమునను తా పూజించి…శివ శివ 


ఆగమముల నుతియించి బహు బాగు లేని భాషలు చాలించి భాగవతులతో పోషించి వర త్యాగరాజ సన్నుతుడనియెంచి…శివ శివ

ఓ మనుజుడా శివ శివ అని ఏల పలకవు, ఏల మననం చేయవు, అలా చేయడంవల్ల నీ చుట్టూవున్న సంసార సాగర భాధలు,భయాలు వెళ్ళిపోతాయి. 

కామాది అరిషడ్వర్గములను తీసివేసి,పరుల డబ్బు, పర కాంతా వ్యామోహమును  అసహ్యించుకొని, పామరత్వమును  వదిలివేసి, శాస్ర్త ప్రమాణముగా నియమానుసారం బిల్వదళములచే ఆ పరశివునికి అర్చన చేసి పుణ్యము సంపాదించరాద. 

మంచివారితొ సహవాసము , ఓర్పుతో త్రిమూర్తులను మననం చేసి, తన హృదయము అనే పద్మము చే సర్వ సమర్పణ చేసి  సిగ్గు అహంకారము వదలి శివ శివ అని మననం చేయి. 

బయటీ వేషములను వదిలివేసి, భాగవతులను ,భగవద్భక్తులను పొషించి, వేదాలను పూజించి, ఆ వరములు ఇచ్చు త్యాగరాజ స్వామి ని సదా శివ శివ అని స్మరణ మననం చేయి.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s