తెలిసి రామ చింతనతో నామము సేయవే ఓ మనసా

తెలిసి రామ చింతనతో నామము సేయవే ఓ మనసా


తలపులన్ని నిలిపి నిమిషమైన తారక రూపుని నిజ తత్వములను…తెలిసి రామ


రామాయన చపలాక్షుల పేరు కామాదుల పోరు వారు వీరు రామాయన బ్రహ్మమునకు పేరు ఆ మానవ జననార్తులు తీరు…తెలిసి రామ


అర్కమనుచు జిల్లెడు తరు పేరు మర్కట బుద్ధులెట్టు తీరు అర్కుడనుచు భాస్కరునికి పేరు కు-తర్కమనే అంధకారము తీరు…తెలిసి రామ


అజమనుచు మేషమునకు పేరు నిజ కోరికలేలాగీడేరు అజుడని వాగీశ్వరునికి పేరు విజయము కల్గును త్యాగరాజ నుతుని….తెలిసి రామ

ఓ.మనసా! ఆ పరతత్వ స్వరూపుడైన రాముని  త్యాగరాజుచే పొగడబడే వానిని తలచుచు ఆ తత్వ స్వరూపుడి నామమును సదా పఠించు, స్మరణచేయు మరవకుండా. అది కూడ ఎలాగు అంటే మన మనస్సులో వచ్చే ఆలోచనలన్ని కూడ ఆపేసి లేదా రాకుండా సాధన చేసి కనీసము ఓక్క నిమిషము  పాటు మన మనస్సుని ఆ రాముని పాదాలపై లగ్నము చేసి  , తరింపచేసే మహిమాన్వితమైన రూపము కలిగిన శ్రీరాముని  మరియు అతని తత్వములను తలచుకొంటూ స్మరణ చేయవే ఓ మనసా. 
రామ అని స్ర్తీలకు( చపలాక్షులు) (చంచలమైన కన్నులు కలవారు) పేరు , ధ్యానములో ఉన్నప్పుడు ఆ పరతత్వమైన రాముడికి బదులు ఈ స్ర్తీలను తలచిన దాని పర్యవసానము కామాది అరిషడ్వర్గమునకు లోనై పతనము అవుతాము. కాని  ఆ బ్రహ్మ స్వరూపుని తలచితే మానవుల పుట్టుకకు కల కారణం తెలసి వాడి అన్ని కోరికలను తీర్చివేసి ముముక్షత్వమును ప్రసాదించగలదు ఆ రామ నామము దానిని స్మరించు. 
అర్కము అంటే జిల్లేడు చెట్టుకు పేరు, మనలోని కుతర్కము లేదా వృథా గా వాదించుట అనేది అంధకారము అంటే కటిక చీకటి లేదా అజ్ఞానము దానిని తోలగించే వాడు భాస్కరుడు ఇతనికి కూడ అర్కుడు అన్న పేరు వుంది. మానవుడి బుద్ది కోతితో సమానం నిలకడ లేకుండా వుండును, ధ్యానము లో కూడ మన బుద్ది కొతిలా నిలకడలేకుండా వుండును. ధ్యానించు నపుడు ఆ భాస్కరుడికి (రాముడికి) బదులుగా జిల్లేడు ను స్మరించిన ఎడల అది నిష్ప్రయోజనము. నిలకడ కోసం ఆ రవి వంటి రాముని ధ్యానించు. 
అజము అంటే మేక దానిని స్మరించిన మన కోరికలు ఎలా ఫలిస్తాయి. అజుడు అని ఆ బ్రహ్మకు (వాగీశ్వరుడు)పేరు అటవంటి ఆ బ్రహ్మను (సృష్టికర్తకు తండ్రి అయిన) రాముని తలచిన మన కోరికలు తీరి విజయము చేకూరును. కావున అట్టి పరబ్రహ్మను, అజ్ఞాన ఛేదకున్ని, మన్మథ జనకున్ని  సదా ధ్యానించు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s