సారమే కాని అన్య మార్గవిచారమేటికే ఓ మనసా

సారమే కాని అన్య మార్గవిచారమేటికే ఓ మనసా


వారు వీరు తెలియ లేక పల్కు వార్తలు విననేలే రామ నామము…సారమే కాని


మార కోటి లావణ్యుడైన రఘువీరుని నామ సుధా రసమునను సారెకు పానము జేసి జగద్-విహారుడై వెలయు నారాయణ నారాయణయనుచును వారము

శరదంబుద నిభుడౌ శ్రీ నారద ముని వల్మీక జాతునికి కూరిమినుపదేశించ లేదా…. సారమే కాని


పరమ పావనుని శరణాగత జన పరిపాలన బిరుదాంకుని సీతా వరుని నామ సుధా రస పానము నిరతమునను జేసి హరి హరి హరియనుచు సంతతంబును సరియు లేని కీర్తి కాంచి దేహము పరవశంబు జెంది శుక బ్రహ్మ

పరీక్షిత్తుకొసగ లేదా వాదా…సారమే కాని


సామ గాన లోలుడౌ రజత గిరి ధాముడైన త్యాగరాజ శివుడతి నేమముతో నామామృత పానము ఏమరకను జేసి రామ రామ రామయనుచు సతతము

శ్రీమదాది గౌరికి శృంగారికిఆ మహిమలనా రహస్యములనతి ప్రేమనుపదేశించ లేదా…సారమే కాని

ఓ మనసా ! సారములేని చౌడు భూములవలే వున్న అన్య మత మార్గముల గురించి ఆలోచించటము ఎందుకు. వారు వీరు చెప్పే మాటలు( ప్రసంగాలు) వినడం ఎందుకు. అత్యంత ఫలదాయకమైన రామనామముఉండగా వెరే ఎందుకు. 
తెల్లని మేఘంవలే  శరీర ఛాయ వుండి, మూడు జగములలోను నారాయణ నామమును సదా స్మరించుచు తిరిగే వాడు సదా కోటిమంది మన్మథులకు సమానమైన రఘవీరుని నామమైన తారక మంత్ర అమృతమును తాగి, వల్మీకంలో పుట్టిన వాల్మీకికి ప్రేమతో ఉపదేశించలేదా అట్టి రామనామము ఉండగా వెరే ఎందుకు. 
శుక మహర్షి పరీక్షిత్తు మహరాజుకు పరమ పావనుడైన వాని,తనను శరణన్న వారిని పరిపాలించే వాడు అని బిరుదు గడించినవాడు, సీతాదేవి కి వరుడైనవాని నామము అనే అమృతమును సదా త్రాగి హరి హరి అంటూ ఎదురులేని కీర్తి గడించిన ఆ రామ నామమును ఇవ్వలేదా ఇందులో వాదము లేదు సందేహం లేదు. 

వెండి కొండపై వెలసి సామగాన లోలుడైన త్యాగరాజ అని పేరు గాంచిన శివుడు నియమములతో శ్రీరామ నామము అనే అమృతమును  ‌ఏమరకుండాఏకాగ్రతతో చేసి , ఆనాది,అత్యంత సుందరమైన గౌరీదేవికి శ్రీరామ నామ మహత్యమును ,అందులోని రహస్యములను ప్రేమతో ఉపదేశించలేదా. అట్టి శ్రీరామ నామము ఉండగా ఇతరములేల.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s