తలచినంతనే నా తనువేమో ఝల్లనెరా

తలచినంతనే నా తనువేమో ఝల్లనెరా


జలజ వైరి ధరాది విధీంద్రుల

చెలిమి పూజలందిన నిను నే…తలచినంతనే


రోటికి కట్ట తగిన నీ లీలలు

మూటికెక్కువైన నీదు గుణములు

కోటి మదన లావణ్యములైన

సాటి కాని నీ దివ్య రూపమును…తలచినంతనే


నిద్రాలస్య రహిత శ్రీ రామ

భద్రానిలజ సులభ సంసార-

చ్ఛిద్రార్తిని తీర్చు శక్తిని విధి

రుద్రాదుల నుతమౌ చరితంబును…తలచినంతనే


పాద విజిత ముని తరుణీ శాప

మోద త్యాగరాజ వినుత ధరా-ప

నాద బ్రహ్మానంద రూప

వేద సారమౌ నామధేయమును…తలచినంతనే


ఓ త్యాగరాజ నుత ! త్యాగరాజు చేత మంచిగా పొగడబడుతున్న ఓ రామ ! నీ నామము సకల వేదముల  సారము అయిన ప్రణవము -రామ అన్న నామము తారకము( తారకము ప్రణవము ఓకటే) అంటారు. అటువంటి తారక నామమును తలచినంతనే నా శరీరము హృదయము పులకరించి పరవశిస్తున్నది. 
ఓ భూధరా -భూదేవి కి పతి అయిన  (రాజైన) , భూజాతకు   పతిఅయిన (ధరాప) నాద ( అంతరంగ నాదము) రూపము, బ్రహ్మానంద ( అంతరంగ ఆనందము) రూపము -సహజ ఆనంద రూపము అయిన నీ రూపాన్ని తలచినంతనే నా శరీరం పులకరించి పరవశిస్తున్నది. 
నీ పాదస్పర్శ చే ఆ అహల్యకు శాపవిమోచనం కలిగించి ఆ గౌతమ అహల్యలకు సంతోషం కలిగించిన ఆ సంఘటన వినినంతనే నా శరీరం పరవశించి పులకరిస్తున్నది. 
 శ్రీరామ !  భద్రుడికి, హనుమంతుడికి నీవు సులభ సాధ్యుడవు ఎందుకు అంటే వారి అచంచల నమ్మకం ,భక్తి కారణం. నీకు ఆ విశ్వామిత్రుడు బల,  అతిబల విద్యలు నేర్పించడం వల్ల మానవ సహజమైన నిద్ర ,ఆకలి వంటివి నీకు కలగవు. అత్యంత చాకచక్యంగా నీ భక్తుల సంసార సాగర కష్టములను ఖండించు, పోగొట్టే నీ శక్తిని సాక్షాత్తు ఆ బ్రహ్మ, రుద్రుడు ఇతర దేవతలు నీ గొప్పతనాన్ని  పొగుడుతున్నారు. దానిని విన్నంతనే నా శరీరం పరవశించి పులకరిస్తున్నది. 
నీ దివ్య లావణ్య రూపము ముందు కోటి మంది మన్మథులు కూడ నిలువలేరు,  నీ గుణముల ముందు ఆ త్రిమూర్తులు కూడ నిలబడలేరు, నీ లీ‌లలు యశోదా దేవి నిన్ను రోటికి కట్టేస్తే దానితో వెళ్ళి గంధర్వులకు శాపవిమోచనం కలిగించావు.  ఇలాంటివి ఎన్నో వాటిని తలచుకోన్నంతనే నాశరీరం పరవశించి  పులకరిస్తున్నది. 
నీటిలో పెరిగే పద్మములకు శత్రువైన చంద్రుని తన తలలో ధరించిన శివుడు,  బ్రహ్మ,  ఇంద్రుడు ఇతర దేవతలునిన్ను అత్యంత స్నేహపూర్వకంగా నీకు పూజలు చేస్తుంటారు. అటువంటి నీ మహిమలను విన్నంతనే నా శరీరం పరవశించి, పులకరిస్తున్నది.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s