నమో నమో రాఘవాయ అనిశం

నమో నమో రాఘవాయ అనిశం

నమో నమో రాఘవాయ అనిశం


శుక నుతాయ దీన బంధవే

సకల లోక దయా సింధవే…నమో నమో


 శ్రిత దురిత తమో బహు రవయే

సతత పాలితాద్భుత కవయే…నమో నమో


నిజ సేవక కల్పక తరవే

అజ రుద్రాద్యమర సు-గురవే…నమో నమో


దీన మానవ గణ పతయే

దానవాంతకాయ సు-మతయే…నమో నమో


ఆయురారోగ్య దాయినే

వాయు భోజి భోగి శాయినే…నమో నమో


నూతన నవనీత భక్షిణే

భూ-తలాది సర్వ సాక్షిణే…నమో నమో


వర గజ కర తులిత బాహవే

శర జిత దానవ సుబాహవే…నమో నమో


నాగ రాజ పాలనాయ

త్యాగరాజ సేవితాయ..నమో నమో రాఘవయ అనిశం

ఓ రాఘవ! త్యాగరాజుచేత సేవలు చేకొంటున్నవాడ నీకు నమస్కారం పదే ! పదే!  అనుక్షణం( అనిశం) 
నాగరాజును పాలించేవాడ, నాగ వంశానికి రాజైన వాసుకి చేత సేవలు కొంటూ, పాలిస్తున్న వాడ, నాగం అంటే ఏనుగు(అష్టదిగ్గజాలు) వాటికి రాజైన గజరాజ రక్షక , -నాగం శరీరంలోని పది వాయువులలో ఓకటి వాటిని సరియైన క్రమంలో నడిపించే వాడ నీకు నమస్కారం.
శుక మహర్షి చేత పొగడబడుతున్న , దీనజన బందువు నీవు,సకల లోకాలను పాలించే దయాసముద్రుడవు ఐన నీకు నమస్కారం.

శ్రితజనులు –  నిన్ను ఆశ్రయించిన వారి అజ్ఞానమనే చీకటిని తరిమివేసే సూర్యుడివంటివాడవు,  మంచివారు(కవయే), జ్ఞానులును ఎల్లప్పుడు ఎంతో నేర్పుగా పరిపాలించే వాడైన నీకు నమస్కారం. 

నిన్ను త్రికరణ శుద్దిగా సేవించే వారికి కామితములను తీర్చు కల్పవృక్షము, బ్రహ్మ(అజ) , రుద్రుడు,దేవతలకు(అమర) మొదలైనవారికి సత్యము ( చైతన్యపు ఎరుక) భోధించే సద్గురువైన నీకు నమస్కారం. 

దానవులను అంతమొందించిన( వారిలోని చెడును)  మంచి జ్ఞానము ప్రసాదించిన వాడ, నీవు స్వతసిద్దంగా మంచి ఆలోచనలు చేయడంలో , నేర్పడంలో నేర్పరివి. దీనులైన మర్త్య (భూలోక)  లోకవాసులైన  మానవ సమూహానికి రాజువి. (గణపతి – శుక్లాం…ఈ శ్లోకంలో సర్వవ్యాపకుడైన నారాయణ తత్వం వుంది).

మానవులకు, దేవతలకు, ఋషి,  ముని గణమునకు ఆయుశ్శు, ఆరోగ్యం ప్రసాదో

దించే  ధన్వంతరి రూపుడవు. వాయువు(గాలిని) ఆహారంగా స్వీకరించే పాముని తల్పంగా కలిగిన మహా పురుషా నీకు నమస్కారం. 

సమస్త లోకాలకు , లోకాలలో జరిగే అన్ని  కార్యక్రమాలకు సాక్షీభూతుడైనటువంటి వాడ , కొత్తదైన  వెన్నెను ( భక్తుడి మనస్సు అనే పాలను , దైవభక్తి అనే పేరుగుతో తోడు పెట్టి  సాధన అనే కవ్వంతో చిలికితే వచ్చిన జ్ఞానమనే వెన్న కలిగిన వారికి మోక్షము ప్రసాదించే )  స్వీకరించే ( జీవాత్మ పరమాత్మ ఐక్యం) నీకు నమస్కారము. 

నీ బాహువులు ఏనుగు తొండమువలే చాలా ధృడముగా వుండి , ఆ బాహువులచే బాణప్రయోగంచేసి దానవులను అణచిన ఆజానుబాహువైన నీకు నమస్కారం. 

 రామచంద్ర మరల మరల నమస్కారం.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s