హెచ్చరికగా రారా హే రామ చంద్ర

హెచ్చరికగా రారా హే రామ చంద్ర

హెచ్చరికగా రారా హే సుగుణ సాంద్ర


పచ్చ విల్తునికన్న పాలిత సురేంద్ర…హెచ్చరికగా రారా…


కనక మయమౌ మకుట కాంతి మెరయగను

ఘనమైన కుండల యుగంబు కదలగను

ఘనమైన నూపుర యుగంబు ఘల్లనను

సనకాదులెల్ల కని సంతసిల్లగను…హెచ్చరికగా రారా


ఆణి ముత్యాల సరులల్లలాడగను

వాణి పతీంద్రులిరు వరుస పొగడగను

మాణిక్య సోపానమందు మెల్లగను

వీణ పల్కుల వినుచు వేడ్క చెల్లగను….హెచ్చరికగా రారా


నిను జూడ వచ్చు భగిని కరంబు చిలుక

మనసు రంజిల్ల నీ మహిమలను పలుక

మిను వాసులెల్ల విరులను చాల జిలుక

ఘన త్యాగరాజు కనుగొన ముద్దు గులుక…హెచ్చరికగా రారా


ఓ రామచంద్ర ! చూసుకొని రావయ్య (హెచ్చరికగా)- మనం ప్రేమతో చెప్పడం. 

ఓ సుగుణాలవారిధి (సాంద్ర) , త్యాగరాజుచేత కనుగొనబడిన ( అంతరంగంలో) ఘనమైన వాడ ,నీవుముద్దులోలికే పంచదార గుళికవు. 

ఓ ఇంద్రాది దేవతలను పాలించువాడ, మన్మథుని తండ్రివైన(పచ్చనివిలుకాడు) నీవు వచ్చెటప్పుడు బంగారపుతోడి రత్న ఖచితమైన నీ కిరీటము మెరవగా,నీ చెవులకు వున్న మకర కుండలములు అల్లాడగా, నీ పాదములకు ఆభరణములైన అందెలు, నూపురములు( గజ్జెలు)  సుందరమైన శబ్దము చేయగా,  సనకసనందాది మును లు నీ రాకను కనుగొని ఆనందించగా  రావయ్య. 

నీ హృదయము పై అలంకారంగా వున్న ఆణిముత్యాల  సరములు కదలాడగా,

బ్రహ్మ( వాణి పతి) , ఇంద్రుడు మొదలైనవారు నీవు వచ్చె మణిక్య, రత్నములచే పొదగబడిన  నీ త్రోవకు రెండువైపుల నిలబడి నీ మహిమను పోగడుతూవుంటే, సరస్వతి,తుంబుర,నారదాది దేవ ఋషుల   వీణాగానము వింటూ, సంబరాలు వెల్లివిరియ రావయ్య. 

నిన్ను.చూడటానికి అని వచ్చిన పార్వతి దేవి చేతిలోని చిలుక దేవ,గంధర్వ, ముని, ఋషిగణ మనసు ఆనందించేలా , నీ గొప్పతనాన్ని,నీ మహిమను  పొగడగ , ఆకాశంలో వుండె గంధర్వ,కిన్నెర, కింపురుష, అప్సర,దేవ ముని గణం పూలను చల్లగా రావయ్య. 

వచ్చి ఆర్తులైన మము కాపాడు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s