​స్వర రాగ సుధా 

​స్వర రాగ సుధా రసయుత భక్తి స్వర్గాపవర్గముర ఓ మనసా….


పరమానందమనే కమలముపై బక భేకము చేలాగియేమి ఓ మనసా… స్వర రాగ సుధా…


ములధారాజ నాదమెరుగుటె ముదమగు మోక్షమురా

కొలాహల సప్తస్వర గృహముల గురుతే మోక్షమురా ఓ మనసా… స్వర రాగ సుధా


బహుజన్మలకు పైని జ్ఞానియై పరగుట మోక్షమురా 

సహజ భక్తితో రాగజ్ఞాన  సహితుడు ముక్తుడురా ఓ మనసా… స్వర రాగ సుధా


మర్దల తాళ గతులు తెలియకనే మర్దించుట సుఖమా

శుద్ధ మనసులేక పూజజేయుట సూకర వృత్తిరా ఓ మనసా…స్వర రాగ సుధా…


రజత గిరిశుడు నగజకు తెల్పు స్వరార్ణవ మరమ్ములు 

విజయముగల త్యాగరాజుడెరుగే విశ్వసించి తెలుసుకో ఓ మనసా… స్వర రాగ సుధా రసయుత భక్తి…


ఓ మనసా!స్వరము అనే అమృతం ,రాగము అనేఅమృత రసంతో కూడిన భక్తి ఐహిక సుఖములను( స్వర్గం) మోక్షమును ( అపవర్గం) ఇస్తుంది. నాదయోగానికి భక్తి తోడైతే మోక్షము ఖచ్చితం. 
మూలాధారంలో జన్మించే పరానాదం అంతర్ముఖులై విన్న వారికి ఆనందమనే మోక్షం, అంతర్ముఖులైన వారికి శరీరంలోని షట్చక్రాలలోని అక్షరాలను,అక్కడ జరిగే నాద ప్రకంపనలను,సప్తస్వర స్థానములను అనుభవించినవారికి ఖచ్చితమైన మోక్షం. ( ఈ మాటను శోభిల్లు సప్తస్వర అనే కీర్తనలో వివరించాము)
ఎన్నో జన్మలు ఎత్తిన తరువాత నిత్య సత్యమైన పరబ్రహ్మం ను తెలియుట మోక్షము, కాని  సహజ భక్తి ( భయం వల్ల, లేదా ఏ ఇతర కారణాలవల్ల కాకుండ తనకు తానుగా కలిగే భక్తి ఉదహరణకు ప్రహ్లాదుడు, హనుమంతుడు)తోసంగీత జ్ఞానం కలిగి దైవ సంకీర్తన చేయువాడు ముక్తిని పొందుతాడు. 
మద్దెల( మృదంగం,తబలా,డోలు) వాయించడంవచ్చినవాడు ( తాళం ఎలా వేయాలి,ఎంత వేయాలి) వాయిస్తే అది అందం, అది వాడికి సుఖం, విన్న వాడికీ సుఖం, అలాకాకుండ వుంటె అది ఎలాంటిది అంటే చిత్తశుద్ది లేకుండా,మనసును ఎటు పడితె అటు మరల్చి దైవాన్ని   ధ్యానించేది పంది చేసేటువంటి కార్యం,అనగా నీచమైనది. కావున మనస్సును లగ్నం చేసి దైవ ధ్యానంపూజ చేయాలి. 
శివుడు ( రజతగిరీశుడు) పార్వతికి ( నగజ) చెప్పిన స్వరార్ణవ ( సంగీత శాస్ర్తము)రహస్యములు గురు కృపచే గురువు మనసు గెలచిన (విజయముగల)త్యాగరాజునికి తెలిసినాయీ.ఈ మాటనమ్మి ,తెలుసుకో మనసా.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s