​సొగసుజాడ తరమా

​సొగసుజాడ తరమా నీ సొగసు జూడా తరమా…

నిగ నిగమనుచు కపోల యుగముచే మెరయు మోము…సొగసుజాడ తరమా…

అమరార్చిత పదయుగము అభయప్రద కరయుగము

కమనీయ తను నిందిత కామ కామరిపునుత నీ సొగసుజూడ తరమా…

వరబింబ సమాధారము వకుళ సుమంబులయురము

కరధృత శర కోదండ మరకతాంగ వరమైన సొగసుజూడ తరమా….

చిరు నగవులు ముంగురులు మరి కన్నుల తేట వర త్యాగరాజ వందనీయ యిటువంటి సొగసుజూడ తరమా…


ఓ.కౌసల్యా పుత్రుడా!శ్రీరామ!త్యాగరాజు చేత నమస్కారములు పొందుతన్నటువంటి నీ అంత అందము ఇంకెక్కడైనా వుందా ! ఏమి అందము ! నీ అందము చూడడానికి ఓక్క ఈ జన్మ సరిపోదు, పోగడడానికి,పాడడానికి నే ఓక్కన్ని సరిపోను! 
నిగనిగలాడే,మెరసిపొతున్నటువంటి నీ చేక్కిళ్ళ ముందు నీలమణి కూడ వెలవెల పొతోంది అంతటి నునుపైన మెరుపు కల  చెక్కిళ్ళచే అలరారు చున్నది నీ మోహము .
నీ పాదములో సకల దేవతలచే అర్చించబడుతున్న పాదద్వయము,నిను శరణన్న వారికి,భక్తులకు  అభయమునిచ్చు   చేతులు కలిగి, మన్మథుడు కూడ నీ అందము ముందువెలవెలపోతున్నాడు, నిన్ను సదా ఆ సదాశివుడు (మన్మథ శత్రువు)స్మరిస్తు, కీర్తిస్తున్నటువంటి  నీ సొగసు చూడనౌతుందొ.

నీ పెదవులో అవి చక్కగా అమర్చిన దొండపండ్లు, వకుళ ఇత్యాది పుష్ప మాలోకలచే చక్కగా అలంకరింప బడిన  హృదయ స్థనాము (ఎద స్థానము),మృదువై చక్కగా వున్న తొడలు కలిగి, చేతులయందు కోదండము,శరములను ధరించిన నీలివర్ణపు రంగు కలిగిన చక్కనైన శరీర భాగములు కలిగి మెరయు శ్రీరామ నీ అందము ఏమని వర్ణించను.
నీ చిరునవ్వు వెలుగు చూచి చందురుడు సిగ్గు పడుతున్నాడు అంతటి చక్కని మచమరోపించే నవ్వు. నీ ముంగురులు వానాకాలపు మొబ్బులవలే, మేఘములవలే వున్నాయి, నీ కన్నులలో తేట పాలమీగడవలేవున్నది. అటువంటి నీ అందాన్ని చూస్తూవుండాలని,పొగడుతు వుండాలి

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s