​సరస సామ దాన

​సరస సామ దాన భేద దండ చతుర 

సాటి దైవమెవరే బ్రోవవే


పరమ శాంభవాగ్రేసరుండగుచు 

బలుకు రావణుడు తెలియ లేక పోయె


హితవు మాటలెంతో బాగ పల్కితివి 

సతముగా-నయోధ్య-నిత్తునంటివి

నత సహోదరుని రాజు చేసి రాగ 

హతము జేసితివి త్యాగరాజ నుత

ఓ శ్రీరామ,! త్యాగరాజుచేత పాడబడెవాడ! నీవు రాజువుగా చతుర ఊ్యహములు అత్యంత రమణీయంగా(సరస) చేయగలిగేవాడివి. ఆ చతుర ఉ్యహములు1.సామం(మంచిమాటలు)2.దానం( కానుకలు,డబ్బులు) 3. భేదం(విడగొట్టడం)4. దండన(శిక్షించడం) ఈ నాలుగు అత్యంత సుందరంగా,చాకచక్యంగా చెసే నేర్పువున్నవాడవు.నావంటి చిన్న భక్తున్ని కాపాడడానికి నీవు తప్ప ఇంకొక దేవున్ని నేను ఎరుగను,కాపాడు.
శంభూ(శివ) భక్తులలో గొప్పవాడుఅయిన( గొప్పలు చెప్పుకొనే)  రావణుడు,నీవే ఆ శివుని హృదయం అని తెలియలేక పోయాడు. శాంభవి విద్య ఎరిగిన వారిలో గొప్పవాడైన రావణుడు,నీకు ఆ శాంభవికి తేడాలేదు అన్నవిషయం తెలుసుకోలేక పోయాడు. 
అటువంటి రావణాసురునితో (రావణునికి) మంచిమాటలు చెప్పావు, చెప్పించావు(హనుమంతుడు,విభీషణుడు,అంగదుడు) , రాజుగా యుద్దము వద్దని సంధి మాటలుచెప్పినావు(నయోధ్య) (సయోధ్య) మూలరామాయణంలో అయోధ్య ఇస్తానని రాముడు ఎక్కడా చెప్పలేదు) రావణాసురుని హతమార్చి(అహంకారము(రాగ

తము) విభీషణుని ఆ లంకకి రాజుగా చేసావు. అంతటి మహానుభావ కాపాడు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s