​సంగీత జ్ఞానము భక్తి వినా

​సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదు మనసా..

భృంగి నటేశా సమీరజా ఘటజ మతంగ నారాదాదులుపాసించే…సంగీత జ్ఞానము

న్యాయాన్యాయము తెలుసును జగములు మాయామాయమని తెలుసును దుర్గుణ కాయదాది షడ్రిపుల  జయించే కార్యము తెలుసును త్యాగరాజునికి…సంగీత జ్ఞానము

ఓ మనసా! మోక్షము పొందడానికి రకరకములైన మార్గములు వున్నాయి. అందులో నాదయోగం ( సంగీత జ్ఞానం) కూడ ఓకటి. కాని వట్టి సంగీత జ్ఞానం వల్ల మోక్షము రాదు. దానికి తోడు భక్తి ,ఆర్థి వుండాలి. (సన్మార్గము) లేకపోతే ఎటువంటి వారికైన మోక్షము రాదు. 

భృంగి( శివగణం) ,  భరతముని( నాట్యాచారుడు) అని ఓక అర్థం ( నాకు అనిపించింది) ,లేదా నటరాజు – శివుడు(నటేశ) , హనుమంతుడు (సమీరజ),అగస్య్తుడు( ఘటజ), మాతంగ మునీ( మీనాక్షీ దేవి( మధుర)) కి తండ్రి,శ్యామలాదండకంలో కాళిదాసు కూడచెప్పారు) , నారదుడు,ఇతర గంధర్వులు మొదలైన దేవ,ఋషిగణం  నిత్యం నిన్ను రకరఠములైన విధులలో ఉపాసించినప్పటికి వారికి మోక్షము కలగలేదు,కారణం వారిలో ఆర్థి లేకపోవడంవల్ల. 

ఈత్యాగరాజుకి న్యాయము ఏదో ,అన్యాయం ఏదో తేలుసు, ఈబాహ్య జగత్తు కూడ మాయామయం అని తేలుసు, ఈ శరీరాన్ని అంటి వుండే కామాది అరిషడ్వర్గమును ఎలా గెలావాలిఅన్నది తెలుసు(సంగీతంతో పాటు, భక్తి,ఆర్థి వుంటే చాలు) .

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s