​నగుమోము గలవాని నా మనోహరుని

​నగుమోము గలవాని నా మనోహరుని

జగమేలు శూరుని జానకీవరుని… నగుమోము గలవాని…


దేవాది దేవుని దివ్య సుందరుని శ్రీ వాసుదేవుని సీతా రాఘవుని…నగుమోము గలవాని…


సుజ్ఞాన నిధుని సోమ సూర్య లోచనుని అజ్ఞానతమమును అణచు భాస్కరుని…నగుమోము గలవాని


నిర్మలాకారుని నిఖిలాఘహరుని ధర్మాది మోక్షంబు దాయచేయు ఘనుని…నగుమోము గలవాని


బోధతో పలుమారు పూజించే నేనారాధింతు శ్రీ త్యాగరాజ సన్నుతుని నగుమోము గలవాని నా మనోహారుని…


ఓజానకీరమణ! త్యాగరాజు చేత చక్కగా పొగడబడి,పాడబడుతున్న, ఓసీతారామ  నేను నిన్ను పూజిస్తూ, ఆరాధిస్తున్నాను, ఏలా అంటే నిన్ను, నీ తత్వాన్ని చక్కగా అర్థం చేసుకొని పలుమారులు అనేకరకాలుగా పూజిస్తున్నాను.  మరినీవెలావున్నావు అంటే 
అందమైన చిరునవ్వు కలిగిన  ( వేన్నెలలో వెలుగు) , నా హృదయ మనోహరుడవై( భక్త జన మనోహరుడు, శత్రు జన ప్రాణహరుడు) ,ఈ అఖిలాండ బ్రహ్మండాన్ని పరిపాలోంచే శూరుడివి అయి జానకీ దేవిని వరించిన లేదా జానకీ దేవి చేత వరించబడిన వాడవు. 
నిఖిల దేవతలందరికి అధినాయకుడివి,దివ్యమైన, సుందరమైన అంగములుకలిగి న శ్రీ వాసుదేవుడివి, (సర్వ వ్యాపకుడివి- వాసుదేవ)  సీతా రాఘవుడివి( పాపములను దహించువాడు) 
అత్యంత మంచిదైన జ్ఞానము( పరబ్రహ్మ తత్వానికి ప్రతిరూపం) నకు నిధి లేదా మూలమైనవాడివి , రవి,చంద్రులు నీ రెండు కన్నులుగా కలవాడివి,  అజ్ఞానము అంటేనే చీకటి కాని ఇక్కడ అజ్ఞాన తమము అన్నారు- ఘోరమైన అజ్ఞానము, కామాది  వికారాలకు లోబడి ఉన్న  జ్ఞానాన్ని పొగొట్టు కోవడం- అటువంటి  ఘోరమైన అజ్ఞానాన్ని తొలగించే రవి వంటి వాన్ని పూజిస్తాను.
నిర్మలము అంటె సున్నితము, కదలికలేనిది, అందమైనది,శుభ్రమైనది అన్న అర్థాలు అన్ని  రాములవారి ఆకారానికి అన్వయించవచ్చు. సున్నితమైన హృదయం,ఎటువంటి కష్టాలలోను కదలని ధైర్యం,అందమైన శరీరం, శుభ్రమైన వస్త్రధారణ , కల అందమైన శరీరాకృతి దాల్చి, నిఖిల -సకల ప్రపంచ జీవరాశి యోక్క అఘము- పాపములను తొలగించువాడు‌, ధర్మది నాలుగు పురుషార్థాలను కొరిన భక్తులకు,అర్హులైనవారికి దయచేసే -ఇచ్చేటువంటి ఘనుడు-గోప్పవాడు లేదా గొప్పదైవము.  అయిన శ్రీరామునిపూజిస్తాను.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s