​ఎంత ముద్దో ఎంత సొగసో

​ఎంత ముద్దో ఎంత సొగసో ఎవరివల్ల వర్ణింపతగునే…


ఎంతవారలైన కాని కామచింతాక్రాంతులైన వారే…ఎంత ముద్దో ఎంత సొగసో


అత్త మీద కనులాసకు దాసులై సత్త భాగవతవేసులైరి

దుత్త పాలరుచి తెలియు సామ్యమే ధురిణిడౌ త్యాగరాజనుతుడు…ఎంత ముద్దో ఎంత సొగసో

గొప్పవాడైన! ఈ భూభారాన్ని మోస్తున్న(ధురీణుడు) ! త్యాగరాజు చే పొగడబడుతున్న శ్రీరామ ! నీ అందం ఎంత ముద్దో! ఏంత సోగసు ఎంతవారైన వర్ణించటం సాధ్యంకాదు. 
ఏంతవారలైన (పండితులైన,పామరులైన) అరిషడ్వర్గాలకు లోబడుతున్నారు కోరికలకు  ( కామం,మదం) పైపై అందాలకు లోబడుతున్నారు కాని లోపల వున్న నీ అందం , సోగసు చూడలేకున్నారు. 
కామానికి లోబడి దాసులై (మనసు మాటవిని దానికి లోబడి) బుద్ది( అత్త)  మాటవినకుండా ,లోకానికి భయపడి అత్త(బుద్ది) మాట వింటున్నట్టు నటిస్తు దొంగ వేషాలు ,పరమభాగవతులుగా , భక్తులుగా వుంటారు.  
పాలు పట్టే గిన్నే(దుత్త)కి పాల రుచి తెలుస్తుందా. అంతర్మంఖులైనవారికి లోన పరమాత్ముని అందం , సోగసు సున్నితత్వం- తత్వం రుచి మరిగిన వారికి బాహ్య అందాలు పెద్దగా రుచించవు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s