​సామజ వరగమన 

​సామజ వరగమన సాధుహృత్సారసాబ్జాపాల కాలాతీత విఖ్యాత…సామజ వరగమన…

సామనిగమజ సుధామయ గానవిచక్షణ గుణ శీల దయాలవాల మాంపాలయ… సామజ వరగమన

వేదశిరో మాతృజ సప్తస్వర నాదాచల దీప స్వీకృత యాదవకుల మురళీ వాదన వినోద మోహన కర త్యాగరాజ వందనీయ…సామజ వరగమన…

ఓ మోహనాకారుడా!నిన్ను చూసిన జనులను నీ మోహంలో (కామం కాదు)(ఆకర్షించేవాడు) పడవేసేటువంటి అందమైనవాడా!(మోహనకర)త్యాగరాజుచే నమస్కరింపబడేవాడివో.  నీ నడక చక్రవర్తి దగ్గర వున్న పట్టపు ఏనుగు వంటి అందమైన,ఠీవైన నడక కలవాడ ! 
సాధుఅంటే మంచివారు, మునిపుంగవులు, ఋషులు,సాధకుల హృదయమనే సరస్సు లో విరబుసే పద్మములకు రాజై వారిని పాలించే వాడ అంటే సూర్యుడై వేలుగొందేవాడ,(హృదయమే పద్మముగా అర్పించే వారిని కాపాడేవాడ) కాలమునకు అతీతుడవైన వాడ,పేరుప్రఖ్యాతాలు,కీర్తి కలవాడ(స్వామి కాలమునకు,గుణాతీతుడు అని గురువులైన వశిష్టుడు,విశ్వామిత్రుడు,శతానందుడు గుర్తించి నడుచుకొన్నారు). 
సామవేదము నుండి పుట్టినది సంగీతము దానికి మూలం సప్తస్వరములు ,నిగమం అంటే వేదం అందునుండి తెలియునది పరబ్రహ్మతత్వం(నిగమజ) . గానవేదం అనే  అమృతములో విచక్షణ (నాదయోగం వల్ల తెలియబడేవాడ) కలిగిన వాడ,గుణశీలుడవు,దయాసముద్రుడవు మమ్ము పాలించు,కాపాడు.
వేదములకు (ఋక్,యజుర్,సామం ) శిరస్సువంటిదైన ఓంకారము దాని  నుండి పుట్టినవి సప్తస్వరములు , నాదము ( ఓంకారము) అనే పర్వతమునకు దీపము వంటివాడవు, యాదవకులములో పుట్టి (అవతరించి) వేణుగానలోలుడై,వేణు( నాదదండము)

7 రంద్రములద్వార ( షట్చక్రములు) గాలిని పంపి (కుండలిని )చలనముద్వార సహస్రారంలో పరమాత్మని చెరుకొవడంఅనే ఆటచే ఆనందము పొందేవాడైన ఓ శ్రీరామ  ఇదే నా నమస్కారములు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s