మరుగేలరా ఓ రాఘవ

మరుగేలరా ఓ రాఘవ

మరుగేల చరాచర రూప పరాత్పర సూర్య సుధాకర లోచన

అన్ని నీవనుచు అంతరంగమున 

తిన్నగా వెదకి తెలుసుకొంటినయ్య 

నిన్నే గాని మదినెన్న జాలనొరుల 

నన్ను బ్రోవవయ్య త్యాగరాజ నుత

ఓ శ్రీరామ! త్యాగరాజు చేత పొగడబడుతున్నవాడ! నన్ను కాపాడు,ఓ రాఘవ!

నీకు నాకు మధ్యలో ఈ దూరం లేదా దాపరికము , ఎడం ఎందుకు స్వామి.
స్వామి!ఈ సమస్త జగత్తులోని కదిలేవి ,కదలనవి అన్ని నీవే ,నీ సృష్టి,నీ ప్రతిరూపమే,ప్రతిఒక్క దానిలోను వున్నది నీవే. ఓ పరాచైతన్యరూప(పరాత్పర)  రవి చంద్రలు నీ నేత్రములు. 
అంతా నీవే అని బయట, నా లోపల ,అంతరంగ చైతన్యము నీదే అని నీవే అని బహుకాల సాధన వల్ల (వెతికి,తిన్నగా) నిజము తెలుసు కొన్నాను. నీవుతప్ప ఇంకొకరు లెరు,ఇంకొకరిని నా మనస్సు,హృదయములో త్రికరణములచే పూజించలేను,తలచను. ఓ రామ కాపాడు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s