మనసు లోని మర్మమును తెలుసుకో

మనసు లోని మర్మమును తెలుసుకో 

మాన రక్షక మరకతాంగ నా మనసు లోని…


ఇన కులాప్త నీవే కాని 

వేరెవరు లేరు ఆనంద హృదయ 


మునుపు ప్రేమగల దొరవై సదా 

చనువునేలినది గొప్ప కాదయా

కనికరంబుతో ఈ వేళ నా 

కరము పట్టు త్యాగరాజ వినుత

ఓ.త్యాగరాజు చేత పోగడబడే ఓ నీలివర్ణ( మరకతాంగ- నీలిరంగు అంగములు కలవాడు)  దేహము కలగి రవి వంశమునకు ఆప్తుడైనటువంటి ఓ రామ !  నా మానరక్షక ( ద్రౌపది మానరక్షకుడు- కృష్ణడు- నీలివర్ణం) అంటే కష్టసమయాలలో కాపడటం.
నీ భక్తుడైన నా మనసులోని రహస్యము(మర్మము) నీవు తేలుసుకో అంటే – భగవంతుడికి భక్తుడుకి మధ్య ఎటూవంటి రహస్యములు వుండవు- శరణాగతి అయినవాడి గురించి అన్ని తేలిసేవుంటాయి. ( నా లోని భావము నీకు తెలుసు అని చెప్పడం). 
నాలో నీవు తప్ప ఇంకొకరు లేరు ,ఆనంద హృదయా-సదా పరమానందములో వుండువాడవు.- నీ ఉనికి నాలో వుండడం వల్ల నేను ఆనందహృదయుడనైతాను. ( నేను ఆ  నిత్యము,సత్యమైన నీ ఆనందములో వుంటాను) 
ఇంతకుమునుపు నన్ను ప్రేమతో నాపై అభిమానముతో ,నాపై అధికారముతో నన్ను పాలించినది,కాపాడినది గొప్పకాదు,ఈవేళ దయతో నా చేయిపట్టి నన్ను నీ వాడిగా చేసుకో. ( ఇది నాయికా భక్తి)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s