నగుమోము కనలేని నా జాలి

నగుమోము కనలేని నా జాలి తెలిసి

నను బ్రోవరాదా శ్రీ రఘువర నీ నగుమోము…


నగరాజ ధర నీదు పరివారులెల్ల

ఒగి బోధన జేసేవారలుకారే యటులుండుదురే నీ నగుమోము…


ఖగరాజు నీ యానతి విని వేగచనలేడో

గగాననికిలకు బహు దూరంబనినాడో 

జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదు

వగజూపకు తాళను నన్నేలుకోరా త్యాగరాజనుత నీ నగుమోము…

ఓ రఘువర! త్యాగరాజు చే పొగడబడేవాడ! నీనుండి నన్ను దూరం చేయోద్దు,తాళలేను,నాపై శీతకన్ను (తక్కువచేసే చూడవద్దు) (వగజూపకు) చూడవద్దుతట్టుకోలేను‌.చిద్విలాసమయిన చిరునవ్వు కలిగిన నీ మోమును ధ్యానించి దర్శించలేని అజ్ఞానం అనే అంధత్వం కల వాడను. ఈ జాలితో నన్ను చూడు. కాపాడు.
ఆనాడు కూర్మావతారుడవై నీ వీపున మంధరపర్వతము మోసి దేవతలకు ఉపకారముచేసావు, కృష్ణుడివయి గోవర్ధన గిరిని ఎత్తి గోవులను గోపాలకులను కాపాడినావు. నీ పరివారము అందరు మంచి తత్వభోధన చేసేటువంటివారే , నా పరిస్థితి చూసి నీకు నన్ను కరుణించమని చెప్పకుండావుంటారొ( చెప్తారు). కాన కరుణించి నీ మోహము చూపించు. 
గరుత్మంతుడు నీ ఆనతి(ఆజ్ఞ) పాటించకుండా , వైకుంఠానికి  నేవున్న ఈ భూమికి చాలాదూరమని అన్నాడా(అలనాడు గజేంద్ర రక్షణకై ఎవరూలేకుండా వచ్చావు అలాగే నేడు కూడ రావాలి)అందుకని రావేమో,ఓ పరబ్రంహ్మ స్వరూపమా(పరమాత్మ) ఈ సమస్త జగత్తును పరిపాలించే వాడివి, నీవు తప్ప అన్యులను నే ఎరుగను,ఇంకెవరున్నారని మోరపె‌ట్టుకొంటాను. వేగమే వచ్చి నీ అందమైన చిరునగవులొలకు నీ ముఖారవిందమును చూపించు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s