తెర తీయగ రాదా

తెర తీయగ రాదా లోని – తెర…

తిరుపతి వేంకట రమణ మత్సరమను


పరమ పురుష ధర్మాది మోక్షముల 

పార దోలుచున్నది నా లోని


మత్స్యముయాకలి కొని కాలముచే 

మగ్నమైన రీతినున్నది

అచ్చమైన దీప సన్నిధిని మరుగడ్డబడి చెరచినట్టున్నది


ఇరవొందగ భుజియించు సమయమున

ఈగ తగులు రీతినున్నది

హరి ధ్యానము సేయు వేళ చిత్తము

అంత్యజు వాడకు పోయినట్టున్నది


వాగురమని తెలియక మృగ గణములు

వచ్చి తగులు రీతినున్నది

వేగమే నీ మతముననుసరించిన 

త్యాగరాజ నుత మద మత్సరమను

ఓ త్యాగరాజుచేత పొగడబడుచున్న , తిరుమలలో వెలసిన వేంకటరమణుని స్వరూపమైన ఓ రామ!

నాలొ వున్న అరిషడ్వర్గములనే తెర తీసివేసి నా సస్వరూపజ్ఞానమూ ఇవ్వు. నా మది మత్సరాది మాయచే కప్పబడింది.దానిని తోలగించి నీ స్వరూపము ను నాకు చూపించు.
ఈ తెర వల్ల (అజ్ఞానం,మాయ)నేను (నాకు) పరమపురుష ప్రాప్తి,చతుర్విద పురుషార్థములు( ధర్మ,అర్థ,కామ,

,మోక్షములు) దక్కకుండా చెస్తున్నది.
చేపను పట్టుకోవాలి అంటే గాలానికి ఎర తగిలించి నీటిలొవదలితే ఆ ఎరకు ఆశపడి చేప  గాలానికి తగిలి చిక్కుకొంటుంది అలాగే నాలోని ఈ తెర (మత్సరాది)చైతన్యమనే  నీ దీప సన్నిదిని అడ్డుకోంటోంది. కావున దీనిని తొలగించు.
 హరివైన నీ పై ధ్యానము చేయునపుడు నా మనసు నిలువక పనికిమాలిన విషయాలపై లగ్నం అయినది ఎలావుందంటే మనస్పూర్తీగా ఇష్టమైన భోజనాన్ని తినేవేళ కంచంలో పురుగు పడితే ఎలా పారవేస్తామో అలాగుంది. కాబట్టి అలాంటి విషయవాంఛలకు లొనుచేసే ఈ తెర తోలగించు. 
మృగగణములు ( జింకలు గుంపులు)  వల (వాగురము)అని తెలియకవచ్చి చిక్కుకొన్నరీతిగా నా మనస్సు ఈ కామాది వాంచలకు చిక్కుకొంటున్నది. నిన్నే శరణు(అన్యథా శరణం నాస్తి) అన్న నాకు ఇవి ఏవి అంటనట్టు చేయి.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s