చక్కని రాజ మార్గములుండగ 

చక్కని రాజ మార్గములుండగ సందుల దూరనేల ఓ మనసా…

చిక్కని పాలు మీగడయుండగ ఛీయను గంగా సాగరమేలే

కంటికి సుందర తరమగు రూపమే ముక్కంటి నోట చెలగే నామమే త్యాగరేజింటనే నెలకొన్నాది దైవమె యిటువంటి శ్రీ సాకేత రాముని భక్తియనే…చక్కని రాజమార్గములుండగా…

ఓ మనసా!అయోధ్య పురవాసుని(సాకేత పురం) అందుకోవడానికి  భక్తి అనేమంచి మార్గము వుండగా వేరే దారులు,ఉపాయం ఎందుకు.
రాజమార్గములు          అంటే ( నవవిధ భక్తి మార్గములు,యోగ సాధనలు, మంత్రసాధనలు, నాద సాధనలు ఇలా) వుండగా వేరే దారులు ఎందుకు. ( వక్రమార్గములు, స్మశాన సాధన, వామాచారం ఇత్యాదులు) 
ఇంటిలో చిక్కని మధురమైన పాలూ,మీగడ వుంటే ,సజ్జనులు అసహ్యించుకోను వారుణి (గంగాసాగరమేల) – అన్ని నదులు సముద్రాన్ని చేరుతాయి. సముద్రము పురుషలింగం,నదులన్నీ స్ర్తీలింగం, సముద్రానికి మరో పేరు వరుణ,దాని శక్తి వారుణి(సోమరసం ( దైవభాష)) (తాటికల్లు(మానవభాష)ఇదికూడ పాలవలే వుంటుంది) (లలితా సహస్రం లో వారుణీ మదవిహ్వలా) అది ఎందులకూ. 
కనులకు ఇంపైన ఇష్టమైన సుందరమైన, రూపం కలిగి ఆ మూడుకన్నులవాడు (శివుడు)  సదా ధ్యానించే ,జపించే రామనామ రూపమై, త్యాగరాజు( త్యాగం చేసినవాడు! ధనము,మానము, ప్రాణము, శరీరం,నేను-నాది అన్న భావన అహం అనే భావన ఇలా సర్వం తన గురువు కోసం, తన దైవంకోసం త్యాగం చేసినవాడు)  ఇంటిలో- గృహములో( హృదయములో ) నెలకొన్న రామమూర్తి ధ్యానము మించి వేరే మార్గములు ఎందుకు. వృథా.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s