వినాయకుని వలెను బ్రోవవే నిను
వినా వేల్పులెవరమ్మా
అనాథ రక్షకి శ్రీ కామాక్షి
సుజనాఘ మోచని శంకరి జనని
నరాధములకును వరాలొసగన్
ఉండ్రములై భూసురాది దేవతలు
రాయిడిని జెంద రాదు దయ
జూడ రాదా కాంచీ పురాధి నాయకి
కాంచిపురాధీశ్వరూరాలైన ఓ కామాక్షీ అమ్మా నను కాపాడు, ఏలా అంటే నీ కోడుకైన వినాయకున్ని ఏలా కాపాడుతావో అలా.
నీవుతప్ప అన్యదైవము నొకుతేలియదు.
అనాథ లకు రక్షణ కల్పించేదాన,సుజనుల అఘము అంటే పాపములను నశింపచేసేదాన,శంకరి అంటే శంకరుని ఇల్లాలు, అని మళ్ళా శుభములు కలిగించేదాన,జనని అంటే తల్లి
నరాధములు అంటే నరులలో పాపాత్ముల
కు వరములు ఇచ్చేటప్పుడు లేదా నరులకు వరములు ఇచ్చేటప్పుడు భూసురులు మొదలగు దేవతలు రాయిడిని అంటే భాదపడరాదు అంటే అమ్మ దేవతలకు, బ్రాహ్మణులకు ఇతర తపోధనులకు వరములు ఇచ్చేది సామన్యం. కాని నావంటి వాడికి వరములు ఇస్తున్నావంటే మిగిలినవారు అన్యధా భావించరాదు. నను దయచూడు అమ్మా కామాక్షీ.